Vladimir Putin: భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ప్రధాని మోదీతో సమావేశం

Russia president Vladimir Putin arrives India

  • భారత పర్యటనకు వచ్చిన పుతిన్
  • పుతిన్ కంటే ముందే వచ్చిన రష్యా బృందం
  • పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు
  • పుతిన్ కు మోదీ అరుదైన కానుకలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు విచ్చేశారు. ఈ సాయంత్రం ఢిల్లీ చేరుకున్న పుతిన్... ఇక్కడి హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, ఇతర రంగాలకు చెందిన పలు కీలక ఒప్పందాలపై ఈ సమావేశంలో సంతకాలు చేసే అవకాశం ఉంది. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపైనా ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించనున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ అరుదైన కానుకలు అందించారు. అవి ఎంతో విలువైన రంగురాళ్లు. వీటిని పర్వత సానువుల నుంచి, నదుల నుంచి సేకరిస్తారు. గుజరాత్ లోని గిరిజనులు సేకరించిన ఈ విశిష్ట రాళ్లను మోదీ... పుతిన్ కు బహూకరించారు.
కాగా, రష్యా బృందం పుతిన్ కంటే ముందే భారత్ వచ్చింది. 2 ప్లస్ 2 విధానంలో సమావేశమైన రష్యా, భారత్ బృందాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్, రష్యా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, సెర్గీ లవ్రోవ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News