Telangana: తెలంగాణలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు

moderate rains expected two day in telangana starting from tomorrow

  • తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు
  • రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం
  • మూడు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నమోదు

తెలంగాణలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, బుధ, గురువారాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఇక, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News