USA: అమెరికాను మళ్లీ వణికిస్తోన్న టోర్నడో భయం!
- కాలిఫోర్నియాను తాకనున్న టోర్నడో
- మూడు రోజుల్లో తాకే ఛాన్స్
- జో బైడెన్ సమీక్ష సమావేశం
- అప్రమత్తమైన అధికారులు
అమెరికాను మళ్లీ టోర్నడో భయం వణికిస్తోంది. అమెరికాలోని కెంటకీలో ఇటీవలే ఓ భారీ టోర్నడో తీవ్ర ప్రాణనష్టం కలిగించిన విషయం తెలిసిందే. దాని ధాటికి 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, అపార ఆస్తి నష్టం కలిగించింది. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఇప్పుడు కాలిఫోర్నియాకూ టోర్నడో భయం పట్టుకుంది.
మూడు-నాలుగు రోజుల్లో కాలిఫోర్నియాను టోర్నడో తాకనుంది. నేడు, రేపు తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
మరోపక్క, ఇప్పటికే టోర్నడో వల్ల పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆ పరిస్థితులకు డ్రోన్ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో టోర్నడో బీభత్సం సృష్టించినట్లు అధికారులు అంచనా వేశారు. వేడి వాతావరణ కూడా టోర్నడోకు కారణమని చెప్పారు. వాతావరణ మార్పులు టోర్నడోకు ఏమేరకు కారణమయ్యాయన్న అంశంపై అధికారులు దృష్టి పెట్టారు.