Google: వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఉద్యోగం ఉంటుంది: ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

Google Warns Employees Those Who are not Vaccinated will get fired

  • ఉద్యోగులందరికీ సర్క్యులర్ జారీ చేసిన సంస్థ
  • జనవరి 18లోపు టీకా వేయించుకోవాలని సూచన
  • లేదంటే తొలి నెల పెయిడ్ లీవ్స్
  • అయినా వేయించుకోకుంటే 6 నెలలు జీతం లేని సెలవులు
  • అప్పటికీ వినకుంటే సంస్థ నుంచి బయటకు

గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను జాబ్ లో నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ సర్క్యులర్ ను జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులంతా తమతమ వ్యాక్సినేషన్ వివరాలను డిసెంబర్ 3 నాటికి సమర్పించాలని, టీకా వేసుకోని వారెవరైనా ఉంటే వచ్చే ఏడాది జనవరి 18లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. టీకా సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించింది.

వ్యాక్సిన్ వేయించుకోకుంటే ముందుగా జీతాల్లో కోత పెడతామని, పదే పదే చెప్పినా వినకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని హెచ్చరించింది. టీకా తీసుకోకుంటే మొదటి 30 రోజుల పాటు పెయిడ్ అడ్మినిస్ట్రేషన్ లీవ్ కింద ఉద్యోగికి సెలవు ఇస్తామని, ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోకుంటే ఆరు నెలల పాటు జీతం లేని వ్యక్తిగత సెలవుల్లోకి పంపిస్తామని హెచ్చరించింది. అప్పటికీ వినకుంటే సంస్థ నుంచి బయటకే పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

తమ ఉద్యోగుల భద్రతకు వ్యాక్సినేషనే కీలకమని ఇప్పటికే చెప్పామని, ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకునేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ సంస్థ టీకా విధానాలపై కచ్చితంగా నిలబడతామని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News