VV Lakshminarayana: బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI former JD Lakshminarayana tweets about AP Special Status issue
  • ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లక్ష్మీనారాయణ ట్వీట్
  • ఏపీ సీఎం, ఇతర పార్టీల నేతలు స్పందించాలని సూచన
  • 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాబోదని వెల్లడి
ఏపీ సహా మరే ఇతర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంగీకరించవని కేంద్రం గతంలో పలుమార్లు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని తెలిపారు. ఈ అంశంపై గౌరవనీయ సీఎం జగన్, అన్ని పార్టీల నేతలు వెంటనే దృష్టి సారించాలని ఆయన సూచించారు.
VV Lakshminarayana
AP Special Status
Niti Aayog
14th Planning Commission
Bihar
Andhra Pradesh

More Telugu News