suresh raina: చమత్కారాలతో.. క్రికెటర్ల ట్వీట్ల ఆట!

suresh Raina Engage In Friendly Banter On Twitter
  • ఒకరు రైల్లో.. మరో ఇద్దరు కారులో
  • ప్రయాణంపై ఫొటోలతో కామెంట్లు
  • చమత్కార సంభాషణకు తెరదీసిన రైనా
వీరంతా ప్రముఖ క్రికెటర్లు. తమ దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డులు నమోదు చేసిన వారు. ప్రస్తుతానికి అయితే విరామంలో ఉన్నారు. వీరే దక్షిణాఫ్రికా క్రికెట్ వెటరన్ జాంటీరోడ్స్ (52), భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్బజన్ సింగ్. వీరిలో ముందుగా సురేశ్ రైనా తాను కారులో కూర్చున్న ఫొటోను సెల్ఫీతీసి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దానికి వీకెండ్ వైబ్స్ అనే క్యాప్షన్ తగిలించాడు.

ఈ పోస్ట్ ను చూసిన జాంటీ రోడ్స్ ఆసక్తికరంగా స్పందించాడు. రోడ్స్ సైతం తాను రైలులో ప్రయాణిస్తున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగితే చర్చేముంటుంది. తన సీటు.. రైనా సీటుతో పోలిస్తే ఎంతో సౌకర్యంగా ఉందంటూ చమత్కరించాడు. ‘రైనా, నా సీటు నీ రైడ్ కంటే చాలా సౌకర్యంగా ఉంది’ అని రిప్లయ్ ఇచ్చాడు.

కానీ, క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన రోడ్స్ ట్వీట్ కు రైనా గౌరవంగా స్పందించాడు. ‘‘నిజమే జాంటీరోడ్స్. మీరు అందుకు పూర్తిగా అర్హులు. త్వరలోనే మీతో కలసి అదే రైలులో ప్రయాణించాలని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు రైనా.

ఇక వీరిద్దరి సంభాషణ చూసి హర్బజన్ సింగ్ ఉండబట్టలేకపోయాడు. తన కారులో కాలుపై కాలు వేసుకుని మరీ ఒక సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని ట్విట్టర్ వేదికపై పోస్ట్ చేసి, 'నా రైడ్ కూడా అంత చెడ్డగా ఏమీ లేదంటూ' ట్వీట్ వేశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ‘నేను ఇంటికి చేరుకున్నాను జాంటీరోడ్స్, సురేశ్ రైనా. మరి మీరు?’ అని పోస్ట్ పెట్టాడు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. 
suresh raina
harbajan singh
jhonty rodes
cricketers
twitter

More Telugu News