Aadhar: ఆధార్ కార్డుల జారీపై తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు

Link Aadhar with Mobile Number CS Somesh Kumar Ordered
  • రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది చిన్నారులు జన్మిస్తున్నారు
  • పుట్టిన వెంటనే వారందరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశం
  • వ్యక్తిగత మొబైల్ నంబర్లతో ఆధార్ జత చేయాలన్న సీఎస్
ఆధార్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది జన్మిస్తున్నారని, పుట్టిన వెంటనే వారందరికీ ఆధార్ కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. రాష్ట్రంలో ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని అందరికీ ఆధార్ కార్డులు జారీ చేయడంతోపాటు వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని సూచించారు. అధికారులతో నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్ ఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు.
Aadhar
Telangana
Somesh Kumar
Aadhar-Mobil Link

More Telugu News