Pushpa: తొలి రెండు వారాల వీకెండ్ల కంటే మూడో వారం వీకెండ్లోనే 'పుష్ప' అధిక వసూళ్లు
- హిందీలోనూ దూసుకుపోతోన్న 'పుష్ప'
- మొదటి వీకెండ్లో ఈ సినిమాకు రూ.12.68 కోట్లు
- రెండో వీకెండ్లో రూ.10.31 కోట్లు
- మూడో వీకెండ్లో రూ.15.85 వసూళ్లు
- మొత్తం కలిపి రూ.62.94 కోట్లు
కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నప్పటికీ 'పుష్ప' జోరు ఏ మాత్రం తగ్గకపోవడమే కాదు.. మరింత పెరుగుతోంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' గత నెల 17న విడుదలైన విషయం తెలిసిందే. హిందీలో 'పుష్ప' సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది.
తొలి రెండు వారాల వీకెండ్లలో కంటే మూడో వారం వీకెండ్లోనే పుష్ప సినిమా అధిక వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. మొదటి వీకెండ్లో ఈ సినిమాకు రూ.12.68 కోట్లు, రెండో వీకెండ్లో రూ.10.31 కోట్లు వచ్చాయి. సాధారణంగా మూడో వీకెండ్లో అంతకు తక్కువగానే వసూళ్లు వస్తాయి. కానీ, పుష్ప సినిమా మాత్రం ఈ వీకెండ్లో రూ.15.85 వసూళ్లు రాబట్టిందని తరణ్ ఆదర్శ్ వివరించారు.
ఈ సినిమా గత శుక్రవారం రూ.3.50 కోట్లు, శనివారం రూ.6.10 కోట్లు, ఆదివారం రూ.6.25 కోట్లు రాబట్టిందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పుష్ప సినిమా మొత్తం రూ.62.94 కోట్లు రాబట్టిందని చెప్పారు. ఈ సినిమా హిందీలో త్వరలోనే రూ.75 కోట్ల క్లబ్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'పుష్ప' సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో వచ్చిన విషయం తెలిసిందే.
ఆలిండియా రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు రాబడుతోందని ఆ సినిమా యూనిట్ పలు సార్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా వాయిదా వేయడంతో పుష్ప మరో 10 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద దూకుడును కనబర్చే అవకాశం ఉంది.