Somu Veerraju: శాంతియుతంగా జాగరణ చేస్తున్న బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: సోము వీర్రాజు

Somu Veerraju condemns Bandi Sajay arrest
  • ఉద్యోగులకు మద్దతుగా బండి సంజయ్ జాగరణ దీక్ష
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • అధికార మదం అంటూ సోము వీర్రాజు ఆగ్రహం
  • రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ వ్యాఖ్యలు
ఉద్యోగుల సమస్యలపై జాగరణ దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుగా శాంతియుతంగా జాగరణ చేస్తున్న బండి సంజయ్ పై టీఆర్ఎస్ సర్కారు అమానుషంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో పోలీసులను ఉపయోగించి బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. గాయపడిన నేతలు, కార్యకర్తలు తగిన వైద్య చికిత్స తీసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ సోము వీర్రాజు ఉద్ఘాటించారు.

పక్క రాష్ట్రంలోని జాతీయ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై దృష్టి పెట్టే ప్రాంతీయ పార్టీ నేతలు మొదట తమ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెడితే బాగుంటుందని హితవు పలికారు.
Somu Veerraju
Bandi Sanjay
Arrest
Jagaran
Police
Andhra Pradesh

More Telugu News