V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ నన్ను హత్య చేయించాలని చూస్తున్నారు.. హెచ్చార్సీలో టీఆర్ఎస్ పార్టీ నేత ఫిర్యాదు

TRS leader files complaint in HRC on Srinivas Goud
  • మహబూబ్ నగర్ లోని రాంనగర్ 43వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి ఫిర్యాదు
  • అక్రమ కట్టడాలపై కేటీఆర్ కు ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకున్నాడన్న సుధాకర్ రెడ్డి
  • తనకు రక్షణ కల్పించాలని కోరిన టీఆర్ఎస్ నేత
టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై టీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ లోని రాంనగర్ 43వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ లో నిర్మితమవుతున్న అక్రమ కట్టడాలపై తాను కేటీఆర్ కు, అధికారులకు ఫిర్యాదు చేశానని... దీంతో శ్రీనివాస్ గౌడ్ తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి, తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను హత్య చేయించాలని చూస్తున్నారని... శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు తనకు రక్షణ కల్పించాలని, శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ను కూడా ఆయన కోరారు.
V Srinivas Goud
TRS
Sudhakar Reddy
HRC

More Telugu News