Omicron: ఏపీలో మరో ఏడుగురికి ఒమిక్రాన్ పాజిటివ్

Seven more Omicron positive cases identifies in AP
  • విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులు
  • ఒకరు గోవా నుంచి రాక
  • ఏపీలో 24కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. వారిలో ఒకరు ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు తెలిపింది.

తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు రాష్ట్రానికి వచ్చారు. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి పెరిగింది.
Omicron
Andhra Pradesh
Positive Cases
New Variant

More Telugu News