Somu Veerraju: అందుకే అతన్ని అల్లుడిగా స్వీకరించలేదు: సోము వీర్రాజు

Somu Veerraju response on case against his son in law
  • తనకు ముగ్గురు కూతుళ్లని చెప్పిన సోము  
  • ఒక అమ్మాయికి తాను పెళ్లి చేయలేదన్న వీర్రాజు 
  • తన కూతురే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని వ్యాఖ్య
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తొలిసారి స్పందించారు. తనకు ముగ్గురు అమ్మాయిలని... కానీ, అల్లుళ్లు మాత్రం ఇద్దరేనని చెప్పారు. ఒక అమ్మాయికి తాను పెళ్లి చేయలేదని, ఆమే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని తెలిపారు. తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని చెప్పారు. అతని క్యారెక్టర్ తనకు నచ్చలేదని, అందుకే అతన్ని అల్లుడిగా తాను స్వీకరించలేదని అన్నారు. ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసు విషయంలో దయచేసి ఎవరూ తన పేరును ప్రస్తావించవద్దని కోరారు.
Somu Veerraju
BJP
Brother in law

More Telugu News