Asha Workers: ఆశావర్కర్లకు సంక్రాంతి సందర్భంగా శుభవార్తను చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

TS Government hiked Asha workers incentives
  • నెలవారీ ప్రోత్సాహకాలను పెంచిన ప్రభుత్వం
  • గత జూన్ నెల నుంచి పెరిగిన ఇన్సెంటివ్ లను అమలు చేయనున్నట్టు ప్రకటన
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఆశా వర్కర్లు
ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి గిఫ్ట్ ను అందించింది. వారి నెలవారీ ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్ లు) పెంచుతున్నట్టు ప్రకటించింది. 30 శాతం మేర ఇన్సెంటివ్ లు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కింద పని చేస్తున్న ఆశావర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.

ప్రోత్సాహకాలు పెరుగుతుండటంలో వారి నెలవారీ జీతాలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న రూ. 7,500 జీతం రూ. 9,750కి పెరగనుంది. గత ఏడాది జూన్ నెల నుంచి పెరిగిన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Asha Workers
Incentives TS Government

More Telugu News