Rahul Gandhi: సరిహద్దుల్లో నిత్యం జరిగే భద్రత వైఫల్యాలపై ప్రధాని ఎందుకు మాట్లాడరు?: రాహుల్ గాంధీ

Rahul Gandhi questions Centre on security lapses at borders

  • పంజాబ్ లో మోదీ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు
  • భద్రతా వైఫల్యమన్న కేంద్రం
  • రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్య  
  • తప్పుబట్టిన రాహుల్ గాంధీ

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ని రైతులు అడ్డగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా కేంద్రం ఆరోపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

"దీన్ని భద్రతా వైఫల్యం అంటున్న ప్రభుత్వం నిత్యం సరిహద్దుల్లో జరిగే తంతును ఏమంటుంది? దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లే సరిహద్దు భద్రతా వైఫల్యాలపై ప్రధాని ఎందుకు మాట్లాడరు?" అని ప్రశ్నించారు. "సరిహద్దుకు సమీపంలో పాంగాంగ్ వద్ద చైనా వారధి నిర్మించడాన్ని ఏమనాలి? ఇంతకంటే అతిపెద్దదైన జాతీయ భద్రతా వైఫల్యం ఉంటుందా? ప్రధాని దీనిపై ఇంతవరకు మాట్లాడలేదు" అని విమర్శించారు.

  • Loading...

More Telugu News