Mister India: ఖమ్మంలో మిస్టర్ ఇండియా పోటీలు.. విజేతగా మహారాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ అధికారి

Maharashtras Sagar Katurde wins mister india title

  • రెండు రోజులపాటు జరిగిన పోటీలు
  • తమిళనాడుకు చెందిన కార్తికేశ్వర్, శర్వణన్‌కు ద్వితీయ స్థానం
  • మోస్ట్ ఇంప్రూవ్డ్ అథ్లెట్‌గా నితిన్ చండీలా
  • జట్టు విభాగంలో భారత రైల్వేకు ప్రథమ స్థానం

ఖమ్మంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ‘మిస్టర్ ఇండియా’ పోటీల్లో మహారాష్ట్ర ఆదాయపన్ను శాఖకు చెందిన సాగర్ కతుర్డె టైటిల్ విజేతగా నిలిచారు. తమిళనాడుకు చెందిన ఆర్.కార్తికేశ్వర్, శర్వణన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జట్టు అంశంలో భారత రైల్వేకు ప్రథమ స్థానం లభించగా, తమిళనాడు జట్టుకు ద్వితీయ స్థానం లభించింది.

హర్యానాకు చెందిన నితిన్ చండిలా మోస్ట్ ఇంప్రూవ్డ్ అథ్లెట్‌గా ఎంపికయ్యాడు. బెస్ట్  పోజర్‌గా తపాలా శాఖకు చెందిన కృష్ణారావు అవార్డు అందుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీలు నిన్న ముగిశాయి. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా జడ్జి పి.చంద్రవేఖర్‌ప్రసాద్, భారత బాడీబిల్డింగ్ సమాఖ్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News