Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయంలో 90 శాతం మంది సిబ్బందికి కరోనా
- ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి
- లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండొద్దన్న కేంద్రమంత్రి
- 15-18 ఏళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు టీకాలు వేయించాలని సూచన
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయంలోని 90 శాతం మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిన్న హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యా సంస్థల క్రీడా మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు.
అనంతరం మాట్లాడుతూ.. తన కార్యాలయంలోని 90 శాతం మంది అధికారులు, సిబ్బంది కరోనా బారినపడినట్టు చెప్పారు. లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 15-18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలన్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ముగ్గులు వేసినవారు వాటి వద్ద ఫొటోలు తీసుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే ధ్రువీకరణ పత్రం వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.