Corona Virus: కరోనాలో మరో కొత్త వేరియంట్.. డెల్టాక్రాన్ గా నామకరణం!
- సైప్రస్ లో బయటపడ్డ డెల్టాక్రాన్
- వేరియంట్ ను గుర్తించిన వైరాలజీ నిపుణుడు
- దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్న సైంటిస్టులు
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. ఓవైపు ఒమిక్రాన్ దెబ్బకు కేసులు అమాంతం పెరిగిపోతుంటే... మరోవైపు కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. సైప్రస్ లో ఈ వేరియంట్ బయటపడింది. దీనికి డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు.
అయితే ఈ కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. ఈ వేరియంట్ ను సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ గుర్తించారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ గురించి సైంటిస్టులు మాట్లాడుతూ... దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.