Chinmayi Sripada: ఇదేంటి సిద్ధార్థ్.. ఇలా చేశావ్?: చిన్మయి శ్రీపాద

Chinmayi Sripada reacts to Siddharth comments on Saina Nehwal
  • పంజాబ్ లో మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ఘటన
  • ఖండించిన సైనా నెహ్వాల్
  • పిరికిపందల చర్య అంటూ వ్యాఖ్యలు
  • ప్రపంచ కాక్ చాంపియన్ అంటూ సిద్ధార్థ్ స్పందన
ప్రధాని నరేంద్ర మోదీని పంజాబ్ లో నిరసనకారులు అడ్డుకున్న వ్యవహారంలో బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ఇది ఎంతో మూర్ఖత్వం అంటూ చిన్మయి స్పందించారు. గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడని, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే వాట్సాప్, లేక ఇతర వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని చిన్మయి పిలుపునిచ్చారు.
Chinmayi Sripada
Siddharth
Saina Nehwal
Narendra Modi
Punjab

More Telugu News