Thunderbolt: హైదరాబాదులో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం
- ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు
- రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
- వాతావరణ కేంద్రం తాజా నివేదిక
- అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాదులో ఈ రాత్రికి పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పిడుగులతో కూడిన వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కాగా, ఆదివారం రాత్రి కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.