Israel PM: నిలువరించలేని మహమ్మారి గురించి ఆందోళన అనవసరం: ఇజ్రాయెల్ ప్రధాని

Omicron unstoppable but no need for hysteria

  • సంక్షోభం పట్ల మెరుగ్గా వ్యవహరిస్తున్నాం
  • ఎవరికి వారుగా సంరక్షణ బాధ్యత తీసుకోవాలి
  • గట్టిగానే ఎదుర్కొంటామన్న బెన్నెట్

కరోనా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించే ప్రయత్నాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ చేశారు. సంక్షోభం పట్ల ప్రభుత్వం ఎంతో మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిలువరించలేని కరోనా ఇన్ఫెక్షన్ బారి నుంచి దేశ ప్రజలను రక్షించుకుంటూ, ఆర్థిక వ్యవస్థను తెరిచి ఉంచినట్టు చెప్పారు.

‘‘ప్రజలు తమను తాము, తమ పిల్లలు, వృద్ధులైన సమీప బంధువులను కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి.  భయాందోళనలకు కూడా చోటు లేదు. ఈ పరిస్థితిని గట్టిగానే ఎదుర్కొంటాం’’ అని బెన్నెట్ చెప్పారు. ఇజ్రాయెల్ జనాభా 94 లక్షల మందిలో 20 నుంచి 40 లక్షల మంది ఒమిక్రాన్ బారిన పడతారన్న అంచనాను బెన్నెట్ వ్యక్తం చేశారు. యుగానికి ఒక్కసారి వచ్చే విపత్తుగా దీన్ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News