GVL Narasimha Rao: తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేస్తారా?: వైసీపీ నేతలపై జీవీఎల్ ఆగ్రహం

GVL fires on YCP leaders

  • రేణిగుంట ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేత అంటూ కథనం
  • పత్రికా కథనం నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ స్పందన
  • దిగ్భ్రాంతి కలిగిస్తోందంటూ వ్యాఖ్యలు
  • ఉన్నతస్థాయి విచారణ కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడి

రేణిగుంట విమానాశ్రయానికి, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు నీటి సరఫరా నిలిపివేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. నీటి సరఫరా పైప్ లైన్లను కత్తిరించడమే కాకుండా, నీటి ట్యాంకర్లు వెళ్లకుండా రోడ్డును సైతం తవ్వేశారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. ఇది వైసీపీ నేతల పనే అంటూ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రోడ్లు తవ్వేయడం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశాను. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరాను" అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ట్వీట్ తో పాటు సదరు పత్రికా కథనాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

  • Loading...

More Telugu News