Allu Arjun: తగ్గేదేలే.. సౌతిండియాలో ఏ హీరో సాధించలేని ఘనతను సాధించిన అల్లు అర్జున్!

Alluarjun  has achieved another milestone by becoming the first south Indian actor to cross 15 million followers on Instagram
  • ఇన్స్టాగ్రామ్ లో 1.5 కోట్లకు చేరుకున్న బన్నీ ఫాలోయర్లు
  • ఇంతమంది ఫాలోయర్లను కలిగి ఉన్న ఏకైక హీరో బన్నీ
  • 2017లో ఇన్స్టాలోకి ప్రవేశించిన అల్లు అర్జున్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు దేశవ్యాప్తమయింది. 'పుష్ప' సినిమాతో బన్నీ ఉత్తరాదికి కూడా పరిచయమయ్యాడు. దీంతో, బన్నీని అభిమానించే వారు నార్త్ లో కూడా ప్రారంభమయ్యారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్స్టాలో 1.5 కోట్ల మంది ఫాలోయర్ల మైలురాయిని అధిగమించాడు. తద్వారా 15 మిలియన్ల ఫాలోయర్లను కలిగి ఉన్న ఏకైన దక్షిణాది నటుడిగా అవతరించాడు. దక్షిణాదిలో ఏ హీరోకి కూడా 1.5 కోట్ల ఫాలోయర్లు లేరు. 2017 నవంబర్ లో బన్నీ ఇన్స్టాగ్రామ్ లోకి ప్రవేశించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే ఆయన ఇంత మంది ఫాలోయర్లను సంపాదించుకున్నాడు.  
Allu Arjun
Instagram
15 Million Followers
Record
Tollywood

More Telugu News