Sensex: మార్కెట్ కబుర్లు... 86 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్!
- ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
- 52 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 5.89 శాతం నష్టపోయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఒడిదుడుకులకు మార్కెట్లు గురైనప్పటికీ... ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 61,309కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,308 వద్ద స్థిరపడింది. ఆటోమొబైల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.19%), మారుతి సుజుకి (2.08%), టాటా స్టీల్ (1.35%), టీసీఎస్ (1.26%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-5.89%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.53%), యాక్సిస్ బ్యాంక్ (-1.25%), టెక్ మహీంద్రా (-1.01%), సన్ ఫార్మా (-0.82%).