Prabhas: ప్రభాస్ - పూజ లేకుండానే రొమాంటిక్ సాంగ్ తీసేశారట!

Radhe Shyam movie update

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్'
  • పాటల కోసమే భారీస్థాయి ఖర్చు
  • మరో ప్రత్యేక ఆకర్షణగా గ్రాఫిక్స్ తో సాంగ్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' సినిమా రూపొందింది. టి - సిరీస్, యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. అందువలన పాటలకి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.

ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుందట. ఆ సీన్ లో నుంచి సాంగ్ లోకి వెళితే బాగుంటుందనే ఒక ఆలోచన ఆ తరువాత వచ్చిందట. అయితే అప్పటికే పూజ డేట్స్ లేవు .. సర్దుబాటు చేసే అవకాశం లేదు. అందువలన గ్రాఫిక్స్ తోనే ఆ సాంగ్ ను తీయాలనే నిర్ణయానికి వచ్చేసి, అలాగే కానిచ్చేశారట.
 
పూర్తిస్థాయిలో ఒక రొమాంటిక్ సాంగ్ ను హీరో హీరోయిన్లు లేకుండా గ్రాఫిక్స్ తో కానిచ్చేయడం ఈ సినిమాకి మరో ప్రత్యేకమైన ఆకర్షణ అని అంటున్నారు. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. కృష్ణంరాజు కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

  • Loading...

More Telugu News