apple: ఆండ్రాయిడ్ ఫోన్ తో పోలిస్తే ఐఫోన్ లో ఉండే ప్రత్యేకతలేంటి?

Apple gives you few reasons to switch from Android to iPhone

  • హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ పక్కా ఆప్టిమైజేషన్
  • అవాంతరాల్లేని వేగవంతమైన పనితీరు
  • రెగ్యులర్ అప్ డేట్స్
  • మెరుగైన కెమెరాలు, ఆడియో అనుభవం

యాపిల్ ఐఫోన్ కు ఉండే క్రేజే వేరు. ప్రపంచంలో నంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ప్రస్తుతం ఇదే. ఆండ్రాయిడ్ తో పోలిస్తే ఐఫోన్ ల ధరలు చాలా అధికంగా ఉంటాయి. రేటులోనే కాదు, ఫీచర్ల పరంగా ఐఫోన్లు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవాలి.

సెక్యూరిటీ
వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణ ఉంటుందని యాపిల్ చెబుతోంది. ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ పక్కాగా ఉంటాయి. ఫోన్ లోని యాప్ లు ఆన్ లైన్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా రక్షణ ఉంటుంది. ఐ మెస్సెజెస్, ఫేస్ టైమ్ వీడియోకాల్స్ కు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది.

కెమెరాలు
నైట్ మోడ్, పోట్రెయిట్ మోడ్, సినిమాటిక్ మోడ్ ఇవన్నీ కలసి ఐఫోన్ లో కెమెరా అనుభవం గొప్పగా ఉంటుందని యాపిల్ అంటోంది.

రెగ్యులర్ అప్ డేట్స్

సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అన్నవి ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఆలస్యం అవుతుంటాయి. కానీ, యాపిల్ ఐవోఎస్ అప్ డేట్స్ మాత్రం రెగ్యులర్ గా వస్తుంటాయి. ఎప్పటికప్పుడు బగ్ లను, తీసేస్తూ, సెక్యూరిటీని పటిష్ఠం చేసే అప్ డేట్స్ ను ఐవోఎస్ పంపిస్తుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సులభంగా మెస్సేజ్ లు, కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు, ఈ మెయిల్ ఖాతాలను యాపిల్ ఫోన్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

పనితీరు వేగం
ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐవోఎస్ ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఆప్టిమైజేషన్ అద్భుతంగా ఉంటాయి. దీంతో పనితీరు విషయంలో అసంతృప్తి, చిరాకు రావు. అలాగే బ్యాటరీ పరిమాణం చిన్నదే అయినా ఎక్కువ సమయం వస్తుంది. ఆడియో అనుభవం కూడా గొప్పగా ఉంటుందని యాపిల్ చెబుతోంది. ఆండ్రాయిడ్ లో బగ్గులు, ల్యాగ్ చూస్తుండడం సర్వసాధారణమే.

  • Loading...

More Telugu News