Kadapa District: కడప జిల్లాలో బయటపడిన బ్రిటిష్ కాలం నాటి రిజర్వాయర్

British eras Reservoir found in kadapa

  • బుగ్గవంక సమీపంలోని బుగ్గ అగ్రహారంలో గుర్తింపు
  • 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు
  • 1890లో ఏర్పాటు చేసినట్టు శిలాఫలకం

కడప జిల్లాలో బ్రిటిషర్ల కాలం నాటి రిజర్వాయర్ ఒకటి బయటపడింది. నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలోని బుగ్గ అగ్రహారంలో దీనిని గుర్తించారు. పొలాల మధ్యలో ఉన్న దీనిపై రెండు అడుగుల వెడల్పుతో 8 రంధ్రాలున్నాయి. దీంతో లోపలికి దిగి పరిశీలించగా 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నాలుగు భాగాలుగా ఉంది.

కడప ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో 1890లో సంప్‌లా దీనిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం కూడా కనిపించింది. అయితే, ఆ తర్వాత బుగ్గవంక డ్యాంను ఏర్పాటు చేయడంతో ఈ రిజర్వాయర్‌తో పని లేకుండా పోయింది. ఫలితంగా మరుగున పడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అది వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News