Allu Arjun: అట్లీకుమార్ తో బన్నీ సినిమా.. సన్నాహాలు మొదలెట్టిన లైకా సంస్థ

Allu Arjun in Atlee Kumar movie
  • 'పుష్ప' సినిమాతో సంచలన విజయం 
  • పెరిగిపోయిన బన్నీ మార్కెట్ 
  • లైకా వారితో జరుగుతున్న చర్చలు   
'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఇంతవరకూ తెలుగుతో పాటు మలయాళ .. కన్నడ భాషల్లో ఆయన సినిమాలు ఎక్కువగా ఆడాయి. ఈ సినిమా తమిళంతో పాటు హిందీలోను భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఆయన మార్కెట్ అమాంతంగా పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి మరింత పెద్ద బ్యానర్లు రంగంలోకి దిగుతున్నాయి.

అలాంటి బ్యానర్లలో లైకా ప్రొడక్షన్స్ ఒకటి. ఈ నిర్మాణ సంస్థ ఎంత పెద్దదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ప్రస్తుతం ఆ సంస్థ 'ఇండియన్ 2' సినిమాను నిర్మిస్తోంది. ఆ తరువాత సినిమాను అల్లు అర్జున్ తో నిర్మించాలనే దిశగా వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి దర్శకుడిగా అట్లీ కుమార్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగిపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2'కి సంబంధించిన పనులతో ఉన్నాడు. అది పూర్తవగానే అట్లీ కుమార్ తో సినిమా ఉండనుందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా కోసం బన్నీకి వారు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఆయన కెరియర్లో అందుకుంటున్న అత్యధిక పారితోషికం ఇదేనని చెప్పుకుంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Allu Arjun
Atlee Kumar
Lyca Production

More Telugu News