Chris Gayle: ప్రధాని మోదీ మెసేజ్ తో నిద్ర లేచాను.. భారత్ కు గణతంత్ర దిన శుభాకాంక్షలు: క్రిస్ గేల్

Woke Up To Personal Message From PM Narendra Modi Chris Gayle
  • వ్యక్తిగతంగా నాకు మెసేజ్ చేశారు
  • మోదీ, భారత ప్రజలతో నాకు సన్నిహిత  సంబంధాలు
  • యూనివర్స్ బాస్ నుంచి ప్రేమతో కూడిన శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన క్రిస్ గేల్ 
73 వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్న భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా తనకు మెసేజ్ పంపించినట్టు తెలిపాడు. ఆ మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

‘‘73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోదీ నుంచి వచ్చిన వ్యక్తిగత మెసేజ్ చూసి నిద్ర లేచాను. మోదీతో, భారత ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండడం తెలిసిందే. యూనివర్స్ బాస్ నుంచి శుభాకాంక్షలు, ఎంతో ప్రేమతో’’ అంటూ గేల్ ట్వీట్ చేశాడు. తనను తాను యూనివర్స్ బాస్ గా గేల్ అభివర్ణించుకున్నాడు. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగానూ ఇదే పదాన్ని ఆయన ప్రయోగించాడు.

భారత్ లో క్రిస్ గేల్ (42)కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విధ్వంసకర బ్యాటింగ్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు గేల్ ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు.
Chris Gayle
Narendra Modi
Republic Day
congratulations
west indies cricketer

More Telugu News