almonds: బాదం గింజలు నానబెట్టుకునే ఎందుకు తీసుకోవాలి?

Why Ayurveda suggests soaking almonds overnight and eating them without the skin
  • నానబెట్టి తీసుకోవడంతో సులభ జీర్ణం
  • బాదం పైపొట్టులో హానికారకాలు
  • జీర్ణానికీ ఇబ్బందే
  • సమృద్ధిగా పోషకాలు
బాదం గింజలను రాత్రి పడుకునే ముందు నీళ్లలో వేసి, మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత పొట్టు తీసి తినాలని చాలా మంది సూచిస్తుంటారు. గతంలో అంతగా అవగాహన లేదు కానీ, ఇటీవలి కాలంలో బాదాన్ని ఈ విధంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందన్న అవగాహన అయితే విస్తృతమైంది. ఇందులో ఉండే సానుకూలతలను ఆయుర్వేద డాక్టర్ గీతా వర తెలిపారు.

‘‘బాదాన్ని నేరుగా తీసుకుంటే మన శరీరం జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకనే వాటిని నానబెట్టి తీసుకోవాలని సూచిస్తుంటారు. బాదం గింజల పైపొట్టులో టానిన్స్, ఫైటిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి పోషకాలను మన శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీంతో రక్తంలో పిత్త గుణం పెరుగుతుంది. అందుకుని నానబెట్టుకుని, పొట్టు తీసేసి తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. తేలిగ్గా జీర్ణం అవుతాయి’’ అని డాక్టర్ గీతా వివరించారు.

బాదంలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఎల్ డీఎల్ కొలెస్టరాల్ ను తగ్గించేందుకు సాయపడతాయి. బాదంలోని ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు నియంత్రణకు సాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమ్ ఇ, ఒమెగా-3, ఒమెగా-6, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్.. వంటివి బాదం నుంచి లభిస్తాయి. శరీరంలో అన్ని ధాతువులకు బాదంతో ఉపయోగకరమని గీత తెలిపారు. కండరాల బలహీనత సమస్యను తగ్గిస్తాయని, జ్ఞాపకశక్తిని పెంచుతాయని తెలిపారు.

కనీసం 5 నుంచి 10 వరకు బాదం గింజలను ప్రతిరోజు రాత్రి నీళ్లలో నానవేసి, మర్నాడు ఉదయం పొట్టు తీసి తీసుకోవాలని గీత సూచించారు. వంటకాల్లోనూ కలిపి తీసుకోవచ్చన్నారు.
almonds
soaking
Ayurveda
eating

More Telugu News