Nirmala Sitharaman: కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధం... కేంద్ర బడ్జెట్ హైలైట్స్ -1

Union budget 2022 highlights

  • 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందించాం
  • జాతీయ రహదారులను 25 వేల కిలోమీటర్లకు పెంచుతాం
  • వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి అన్నారు. కేంద్ర బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతుండటం ఇది నాలుగోసారి.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:
  • కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుంది.
  • ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
  • వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాం.
  • పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి చేస్తున్నాం.
  • సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం.
  • జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.
  • అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు. 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్.
  • దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
  • పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.
  • డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.  
  • ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయింది.
  • సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తాం.
  • తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
  • 2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.
  • వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు.
  • రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం.
  • ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.
  • డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.
  • వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.
  • ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించాం.
  • ఎయిర్ ఇండియా బదిలీని సంపూర్ణంగా పూర్తి చేశాం.
  • రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.
  • కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది.

  • Loading...

More Telugu News