Nirmala Sitharaman: ఎల్ఐసీ ప్రైవేటీకరణ.. ప్రైవేట్ రంగంలో అడవులు.. కేంద్ర బడ్జెట్ హైలైట్స్ - 4
- ఎలెక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
- బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తికి 4 పైలట్ ప్రాజెక్టులు
- ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.
బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:
- ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తాం.
- డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు.
- వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్ లో మార్పులు చేస్తాం.
- దమన్ గంగా - పీర్ పంజాల్, పర్ తాపీ - నర్మదా, గోదావరి - కృష్ణా, కృష్ణా - పెన్నా, పెన్నా - కావేరీ నదుల అనుసంధానానికి బడ్జెట్ లో ప్రోత్సాహం. దీని వల్ల లబ్ధి పొదే రాష్ట్రాల నుంచి అంగీకారం రాగానే నదుల అనుసంధానం ప్రయత్నాలను కేంద్రం ప్రారంభిస్తుంది.
- కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తాం.
- కరోనా కారణంగా మానసిక అనారోగ్యానికి గురైన వారి కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, సంరక్షణ సేవల కోసం టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్.
- డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తాం.
- విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల అనుసంధానం.
- ప్రైవేట్ రంగంలో అడవుల పెంపకం కోసం పథకం.
- ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం.
- బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు.
- దేశ వ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్లు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్ర సాయం.
- పట్టణ ప్రణాళిక కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.