lalu prasad yadav: తేజస్వి యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు అవుతాడని చెప్పినవాళ్లు మూర్ఖులు: లాలూ
- ఏది జరిగినా మాకు తెలుస్తుంది
- అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్టు ప్రచారానికి ఖండన
- లాలూయే అధ్యక్షుడిగా కొనసాగుతారు
- పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్ష పదవిపై లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పోరు నడుస్తోంది. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నాడంటూ వార్తలు వినిపించడం తెలిసిందే. దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తేజస్వి యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు అవుతున్నాడంటూ చెప్పినవాళ్లను మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు.
ఆర్జేడీ అధ్యక్షుడుగా తాను తప్పుకుంటున్నట్టు వచ్చిన వార్తలను లాలూ కొట్టి పడేశారు. ‘‘అటువంటి వార్తలను ప్రచారం చేసే వాళ్లు మూర్ఖులు. ఏం జరిగినా మాకు తెలుస్తుంది కదా’’ అని లాలూ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తేజస్వి యాదవ్ పార్టీ అధ్యక్షుడు కానున్నాడనే వార్తలను లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రసాద్ యాదవ్ సైతం ఖండించారు.
‘‘లాలూ ప్రసాద్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఆయన పార్టీని చక్కగా నడిపిస్తున్నారు’’ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం ఈ నెల 10 పాట్నాలో జరగనుంది. దీనికి లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, తేజస్వి యాదవ్, ఇతర సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.