Gandhi: న్యూయార్క్ లో మహాత్ముడి కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
- మాన్ హటన్ స్క్వేర్ లో నిలువెత్తు గాంధీ విగ్రహం
- 1986లో ఏర్పాటు
- ఇది కాంస్య విగ్రహం
- విగ్రహ ధ్వంసంపై భారత కాన్సులేట్ జనరల్ ఆగ్రహం
అమరికాలో గతంలోనూ భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలు దాడికి గురయ్యాయి. తాజాగా అమెరికా ప్రధాన వాణిజ్య నగరం న్యూయార్క్ లోని ప్రఖ్యాత మాన్ హటన్ స్క్వేర్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ కాంస్య విగ్రహం ఎత్తు 8 అడుగులు.
ఈ ఘటన శనివారం జరిగినట్టు న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. మహాత్ముడి విగ్రహ ధ్వంసం ఘటనపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలటూ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలను కోరామని భారత కాన్సులేట్ జనరల్ వర్గాలు తెలిపాయి. ఈ విగ్రహాన్ని గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని అందించగా, 1986లో ఆవిష్కరించారు.
కాగా, గాంధీ విగ్రహం ధ్వంసం చేశారన్న వార్తతో అమెరికాలో భారతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని ఈ విధంగా అవమానించడాన్ని తాము ఖండిస్తున్నామని భారత సంతతి సంఘాల చైర్మన్ అంకుర్ వైద్య తెలిపారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.