Sammakka-Saralamma: సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం దేవాదాయశాఖ వినూత్న ప్రయోగం

Telangana Endowment ministry good news to sammakka devotees

  • ఇంటి నుంచే మొక్కుల చెల్లింపులు, ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • ఆర్టీసీ, తపాలాశాఖతో కలిసి దేవాదాయశాఖ ఒప్పందం
  • ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు టీఎస్ ఫోలియా యాప్ ద్వారా ప్రసాదం

వివిధ కారణాలతో సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులు తల్లులకు మొక్కలు చెల్లించుకోలేకపోయామని, ప్రసాదం పొందలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారి కోసం దేవాదాయ శాఖ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. భక్తులు ఇంటి నుంచే మొక్కులు చెల్లించడంతోపాటు ప్రసాదాన్ని కూడా పొందేలా ఆర్టీసీ, తపాలాశాఖతో కలిసి దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

టీఎస్ ఫోలియా యాప్ ద్వారా ఈ సేవలను వినియోగించచుకోవచ్చని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పోస్టు ద్వారా ప్రసాదాన్ని పొందాలనుకున్న వారు ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు ఈ యాప్ ద్వారా రూ. 225 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మొక్కులు, బంగారం (బెల్లం) చెల్లించాలనుకున్న వారు మాత్రం ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం 040 30102829, 040 68153333 నంబర్లలో సంప్రదించవచ్చు.

  • Loading...

More Telugu News