Rajanikanth: 'బీస్ట్' డైరెక్టర్ తో రజనీకాంత్!

Rajani in Nelson Dileep Kumar movie
  • 'డాక్టర్'తో హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్
  • విజయ్ హీరోగా రూపొందిస్తున్న 'బీస్ట్'
  • పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చిన రజనీ
  • త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు  
తమిళనాట విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. నయనతార ప్రధాన పాత్రధారిగా ఆయన రూపొందించిన 'కొలమావు కోకిల' అక్కడ సూపర్ హిట్. చాలా తక్కువ బడ్జెట్ లో ఒక ఆసక్తికరమైన సినిమాను ఎలా తీయవచ్చుననడానికి నిదర్శనంగా ఆ సినిమా కనిపిస్తుంది.

ఇక ఇటీవల ఆయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన 'డాక్టర్' సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టి, కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ఆయన దర్శకత్వంలోనే ఇప్పుడు విజయ్ 'బీస్ట్' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయనను పిలిచిమరీ రజనీకాంత్ అవకాశం ఇచ్చారనేది కోలీవుడ్ టాక్.

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ యువ దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. అలాగే ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ టాలెంట్ ను గుర్తుంచి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఆ తరువాత లోకేశ్ కనగరాజ్ తో రజనీ సినిమా ఉండొచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది. లోకేశ్ ప్రస్తుతం కమల్ సినిమా 'విక్రమ్'తో బిజీగా ఉన్నాడు.
Rajanikanth
Nelson Dileep Kumaar
Kollywood

More Telugu News