Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ కు రూ.10.75 కోట్లు... ఐపీఎల్ వేలంలో మరికొన్ని ముఖ్యాంశాలు ఇవిగో!

Delhi Capitals bought Shardul Thakur

  • ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
  • బెంగళూరులో వేలం ప్రక్రియ
  • టీమిండియా ఆటగాళ్లకు భారీ ధరలు
  • కోట్లు పలికిన యువ ఆటగాళ్లు

ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియలో తొలి రోజు ఆసక్తికర కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాలంలో నమ్మదగిన ఆల్ రౌండర్ గా ఎదిగిన శార్దూల్ ఠాకూర్ కు భారీ మొత్తానికి అమ్ముడయ్యాడు. బంతితోనూ, బ్యాట్ తోనూ చెలరేగే సత్తా ఉన్న శార్దూల్ ఠాకూర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

గత కొన్ని సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన శార్దూల్... ఈసారి మరో జట్టుకు మారాడు. ఐపీఎల్ లో ఆడినా, టీమిండియాలో అయినా... కెప్టెన్  ఎప్పుడు వికెట్ కావాలన్నా బ్రేక్ ఇవ్వగలిగే సామర్థ్యం శార్దూల్ సొంతం. 2021 ఐపీఎల్ సీజన్ లో చెన్నై తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

 ఇతర ఆటగాళ్ల వివరాలు...

  • షారుఖ్ ఖాన్-రూ.9 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • రాహుల్ త్రిపాఠి- రూ.8.5 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
  • యజువేంద్ర చహల్- రూ.6.5 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
  • అభిషేక్ శర్మ-రూ.6.5 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
  • రాహుల్ చహర్-రూ.5.25 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • పరాగ్ రియాన్-రూ.3.8 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
  • డివాల్డ్ బ్రెవిస్- రూ.3 కోట్లు (ముంబయి ఇండియన్స్)
  • అభినవ్ సదరంగని-రూ.2.6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • కుల్దీప్ యాదవ్-రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • ప్రియమ్ గార్గ్-రూ.20 లక్షలు (సన్ రైజర్స్)
  • అశ్విన్ హెబ్బర్-రూ.20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • సర్ఫరాజ్ ఖాన్-రూ.20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్) 

  • Loading...

More Telugu News