TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీని ప్రారంభించిన టీటీడీ

Issuing of Tirumala Balji free darshan tockens started from today
  • ఈరోజు నుంచి ఉచిత దర్శనం టోకెన్ల జారీ
  • రోజుకు 15 వేల టోకెన్లను జారీ చేయనున్న టీటీడీ
  • రేపటి నుంచి ఉచిత దర్శనాలకు అనుమతి
తిరుమల శ్రీవారి ఉచిత దర్శనానికి ఉచిత టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈరోజు టోకెన్ తీసుకున్న వారికి రేపటి నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లను జారీ చేయనున్నారు. ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉత్తరాది నుంచి వచ్చిన భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
TTD
Free Darshan Tockens
Tirumala

More Telugu News