Sensex: తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 145 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 30 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 1.41 శాతం లాభపడ్డ భారతి ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేసినప్పటికీ... చివరకు వారు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
దీంతో మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 57,996కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 17,322 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (1.41%), హెచ్డీఎఫ్సీ (1.29%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.10%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.04%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.93%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.56%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.39%), టాటా స్టీల్ (-1.28%).