Kiran Abbavaram: 'సెబాస్టియన్' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!
- 'సెబాస్టియన్'గా కిరణ్ అబ్బవరం
- కామెడీ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- సంగీత దర్శకుడిగా గిబ్రాన్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
కిరణ్ అబ్బవరం ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా ప్రమోద్ - రాజు కలిసి 'సెబాస్టియన్ PC 524' సినిమాను నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక పాటను విడుదల చేశారు.
'నీ మాటే వింటే రాదా మైమరపే .. నీ పేరు అంటే రాదా మైమరపే, నేను ఎవరో తెలిసింది నీవల్లే .. నువ్వు లేని నేను నేను కాదులే' అంటూ ఈ పాట సాగుతోంది. సానపాటి భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా .. కపిల్ కపిలన్ ఆలపించాడు. నాయకా నాయికలపై చిత్రీకరించిన పాట ఇది.
కిరణ్ అబ్బవరం సరసన నాయికలుగా కోమలి ప్రసాద్ - నమ్రత దారేకర్ అలరించనున్నారు. హీరో రేచీకటితో బాధపడుతూ ఉంటాడు. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండటానికి నానా తంటాలు పడుతుంటాడు. అలాంటి ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది చూపించే కామెడీ థ్రిల్లర్ ఇది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.