Erra Gangi Reddy: వివేకా హత్య కేసు సిట్ 1, సిట్ 2 నివేదికలు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వండి: ఎర్ర గంగిరెడ్డి
- వివేకా హత్య కేసులో ఏ1 ముద్దాయి ఎర్ర గంగిరెడ్డి
- సిట్ నివేదికలను సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్
- సీఆర్పీసీ 207 సెక్షన్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలని విన్నపం
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన సిట్ 1, సిట్ 2 దర్యాప్తు నివేదికలను కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. సీఆర్పీసీ 207 సెక్షన్ ప్రకారం నివేదికలను సమర్పించేలా ఆదేశాలను ఇవ్వాలని విన్నవించారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు ఈ పిటిషన్ కు సంబంధించి సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.