Yash Dhull: తిరుగులేని ఫామ్ లో ఉన్న టీమిండియా అండర్-19 కెప్టెన్... రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ

Yash Dhull blasts two centuries in his career first Ranji match

  • తమిళనాడుతో రంజీ మ్యాచ్
  • ఢిల్లీ జట్టుకు ఆడుతున్న యశ్ ధూల్
  • తొలి ఇన్నింగ్స్ లో 113 పరుగులు
  • రెండో ఇన్నింగ్స్ లోనూ 113 నాటౌట్
  • ధూల్ కు కెరీర్ లో ఇదే తొలి రంజీ మ్యాచ్
  • ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత్
  • కెప్టెన్ గా వ్యవహరించిన ధూల్

ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ సాధించిన భారత కుర్రాళ్ల జట్టు సారథి యశ్ ధూల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కెరీర్ లో తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 19 ఏళ్ల కుర్రాడు... రెండో ఇన్నింగ్స్ లోనూ శతకం సాధించి ఔరా అనిపించాడు.

కెరీర్ తొలి రంజీ మ్యాచ్ లో ఇలా రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్లలో యశ్ ధూల్ మూడోవాడు. గతంలో నారిమన్ కాంట్రాక్టర్ (1952-53), విరాట్ అవథే (2012-13) తమ తొలి రంజీ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాల మోత మోగించారు.

కాగా, గువాహటిలో జరుగుతున్న రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో యశ్ ధూల్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తమిళనాడు జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 113 పరుగులు చేసిన ధూల్, రెండో ఇన్నింగ్స్ లోనూ సరిగ్గా 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

  • Loading...

More Telugu News