Sunil Gavaskar: మూడో టీ20కి కోహ్లీ జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది: గవాస్కర్

Gavaskar opines on Kohli not there in Team India for last match with West Indies
  • కోహ్లీకి విశ్రాంతి
  • శ్రీలంకతో టీ20 సిరీస్ లోనూ కోహ్లీకి రెస్ట్
  • స్పందించిన గవాస్కర్
  • కోహ్లీ ఫామ్ పై తీవ్ర చర్చ జరుగుతోందని వెల్లడి
  • ఇలాంటి వేళ విశ్రాంతి సరికాదని వ్యాఖ్యలు
కోల్ కతాలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ మ్యాచ్ ఆడుతున్న టీమిండియాలో కోహ్లీ లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపా. రెండో టీ20లో మెరుగ్గా ఆడిన కోహ్లీ, ఈ మ్యాచ్ లోనూ అదే రీతిలో ఆడి ఫామ్ అందిపుచ్చుకుంటాడని ఆశించానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

కోహ్లీ ఫామ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుతం సమయంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదని అన్నారు. కోహ్లీ వెస్టిండీస్ తో చివరి టీ20లోనే కాదు, మరికొన్ని రోజుల్లో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ లోనూ పాల్గొనడంలేదు.
Sunil Gavaskar
Virat Kohli
Team India
West Indies

More Telugu News