Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానా

CBI court in Ranchi sentences RJD leader Lalu Prasad Yadav to 5 years imprisonment

  • దాణా కుంభకోణం ఐదో కేసులో శిక్ష ఖరారు చేసిన రాంచీ సీబీఐ కోర్టు
  • ఐదేళ్ల జైలు శిక్ష
  • రూ. 60 లక్షల జరిమానా

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీలోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు... ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. ఈ కేసుకు సంబంధించి లాలూను గత వారమే కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈరోజు శిక్షను ఖరారు చేసింది.

1990లలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయట ఉన్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి ఇల్లీగల్ గా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News