YS Vivekananda Reddy: వివేకా కేసులో ట్విస్ట్.. సీబీఐ అధికారిపై కేసు నమోదు
- సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపణలు
- తాము చెప్పినట్టే చెప్పాలని రాంసింగ్ బెదిరించారని ఫిర్యాదు
- కడప రిమ్స్ స్టేషన్‌లో రాంసింగ్‌పై కేసు నమోదు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం వరుస ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వివేకా వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి రెండో దఫా తన వాంగ్మూలాన్ని ఇవ్వగా.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు నమోదు అయ్యింది.
వివేకా హత్య కేసు దర్యాప్తులో తాము చెప్పినట్లుగానే చెప్పాలని రాంసింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కడప రిమ్స్ స్టేషన్‌లో రాంసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.