North Korea: అందుకే ర‌ష్యా దాడులు చేస్తోంది: యుద్ధంపై ఉత్త‌ర కొరియా స్పంద‌న‌

north Korea on war

  • యుద్ధానికి అమెరికానే కారణం
  • ర‌ష్యా త‌న‌ భద్రత కోసం చట్టబద్ధమైన డిమాండ్ చేసింది
  • దాన్ని పట్టించుకోకుండా అమెరికా చ‌ర్య‌లు తీసుకుంది 
  • సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించింద‌న్న ఉత్త‌ర‌కొరియా

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఉత్త‌ర‌ కొరియా స్పందించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగ‌డానికి అమెరికానే కారణమని ఉత్తర కొరియా ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఉత్తర‌ కొరియా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాల‌ని అమెరికా ప్ర‌య‌త్నించిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ర‌ష్యా త‌న‌ భద్రత కోసం చట్టబద్ధమైన డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా అమెరికా సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని అంత‌ర్జాతీయ నిపుణుడు పరిశోధకుడు రిజీ సాంగ్ అన్నారు. 

ఈ విష‌యాన్ని ఉత్త‌ర‌కొరియా ప్ర‌స్తావించింది. అమెరికా ప్ర‌ద‌ర్శించిన ఈ తీరు వ‌ల్లే యుద్ధం ప్రారంభ‌మైంద‌ని పేర్కొంది. కాగా, యుద్ధ పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు నాటో ప‌నిచేస్తోంది. ఈ కూట‌మిలో చేరిన ఏ దేశంపైన అయినా దాడి జ‌రిగితే అన్ని దేశాలు క‌లిసి ఆ దాడిని తిప్పికొడ‌తాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాల‌ని అమెరికాతో పాటు స‌భ్య దేశాలు ప్ర‌య‌త్నించాయి. ఈ నేప‌థ్యంలోనే ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు చేస్తోంద‌ని ఉత్త‌ర‌కొరియా అంటోంది.

  • Loading...

More Telugu News