Manchu Vishnu: మంచు ఫ్యామిలీపై ఆరోప‌ణ‌లు.. వైర‌ల్‌గా విష్ణు హెయిర్ స్టైలిస్ట్‌ నాగ‌శ్రీను వీడియో

manchu vishnu hair slysist releases vedio

  • విష్ణుతో పాటు మోహ‌న్ బాబు దాడి చేశారు
  • కులం పేరుతో దూషించి చిత్రహింస‌ల‌కు గురి చేశారు
  • అవ‌మానాలు భ‌రించ‌లేకే ఉద్యోగం మానేశానన్న నాగ‌శ్రీను 

మా అధ్య‌క్షుడు, టాలీవుడ్ యువ హీరో మంచు విష్ణు కార్యాల‌యంలో చోరీ జ‌రిగిన ఘ‌ట‌న ఓ కీల‌క మ‌లుపు తిరిగింది. మంచు ఫ్యామిలీ ఆరోపిస్తున్న‌ట్లుగా విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీను ఈ చోరీకి పాల్ప‌డ్డాడ‌ని విష్ణు మేనేజ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

అయితే కాసేప‌టి క్రితం దొంగ‌త‌నం చేసిన‌ట్లుగా భావిస్తున్న నాగ‌శ్రీను ఓ సెల్ఫీ వీడియో విడుద‌ల చేశాడు. ఆ వీడియోలో తాను చోరీకి పాల్ప‌డ‌లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌డంతో పాటు మంచు ఫ్యామిలీపై అత‌డు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తోంద‌ని అత‌డు తెలిపాడు. 

ఆ వీడియోలో నాగశ్రీను ఇంకా చెబుతూ... ” మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నన్ను చిత్ర హింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి, కులం పేరుతో అవమానించిన కారణంగా నేను ఉద్యోగం మానేశాను. అలా మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని నా మీద అక్రమంగా కేసు పెట్టారు. 

మోహన్ బాబు నన్ను తిట్టడం, నన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొట్టడం.. అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఇదంతా ఫిబ్రవరి 17 న మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగింది. నాపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం విని నా తల్లికి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. 10 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాను. 

నాపై ఇలాంటి నిందలు వేయడం మీకు భావ్యం కాదు. విష్ణుబాబు నాపై అనవసరంగా కేసు పెట్టించారు. వారు అన్న బూతులు నేను మీకు చెప్పలేను. ఆ మాటలు పడలేకే నేను ఉద్యోగం మానేశాను. నాలాంటి చిన్నవారి జీవితాలతో ఆదుకోవడం మీలాంటి పెద్దవాళ్లకు తగదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈ వీడియో చూసిన పెద్దలు నాకు న్యాయం చేయండి” అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News