Ukraine: ఈయూలో సభ్యత్వం ఇవ్వండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి కొత్త డిమాండ్
- బెలారస్లో రష్యాతో ఉక్రెయిన్ చర్చలు
- అదే సమయంలో జెలెన్స్కీ వీడియో సందేశం
- ఈయూలో సభ్యత్వం ఉక్రెయిన్ హక్కు అని స్పష్టీకరణ
రష్యాతో యుద్ధం, ఆ దేశంతో యుద్ధాన్ని ఆపే దిశగా ఓ వైపు బెలారస్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ కొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. తమకు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు విడుదల చేసిన వీడియో సందేశంలో జెలెన్స్కీ ఈ డిమాండ్‌ను వినిపించారు.
ఈ వీడియో సందేశంలో జెలెన్ స్కీ ఏమంటారంటే.. ఉక్రెయిన్‌కు వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలి. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది మా లక్ష్యం. ఇది మా న్యాయమైన హక్కు. ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.