Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 768 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 252 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా నష్టపోయిన టైటాన్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యా యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 768 పాయింట్లు కోల్పోయి 54,333కి పడిపోయింది. నిఫ్టీ 252 పాయింట్లు పతనమై 16,245కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.78%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.78%), టెక్ మహీంద్రా (1.84%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.14%), సన్ ఫార్మా (1.08%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-5.05%), మారుతి సుజుకి (-4.66%), ఏసియన్ పెయింట్స్ (-4.61%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.90%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.43%).