Ravindra Jadeja: మొహాలి వేదికగా రవీంద్ర జడేజా రికార్డులు
- 7వ స్థానంలో 150కు పైగా పరుగులు సాధించిన మూడో ఆటగాడు
- గతంలో కపిల్ దేవ్, పంత్ లకే ఈ రికార్డు
- టెస్ట్ కెరీర్ లో అత్యుత్తమ స్కోరు
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం శనివారం రవీంద్ర జడేజా రికార్డులకు వేదికగా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ లో 175 పరుగులు సాధించిన జడేజా జట్టుకు అజేయంగా నిలిచాడు. అతడి టెస్ట్ కెరీర్ లో ఇదే అత్యుత్తమ స్కోరు. 1986లో కాన్పూర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కపిల్ దేవ్ 7వ స్థానంలో వచ్చి 163 పరుగులు సాధించిన రికార్డును.. జడేజా అధిగమించాడు. శ్రీలంక జట్టుపై టెస్ట్ మ్యాచ్ లో ఏడో స్థానంలో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.
7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారత జట్టు తరఫున 150 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డు సాధించాడు. జడేజాకు ముందు కపిల్ దేవ్, రిషబ్ పంత్ లకే ఇది సాధ్యపడింది. ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన వచ్చి మూడు శతక భాగస్యామాల రికార్డును కూడా నమోదు చేశాడు.