vangalapudi anitha: వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ మ‌హిళా నేత తీవ్ర వ్యాఖ్య‌లు

anitha fires on ysrcp mla prasanna kumar reddy
  • అనిత కేరెక్ట‌ర్‌పై ప్ర‌స‌న్న కామెంట్లు
  • ప్ర‌స‌న్న‌పై విరుచుకుప‌డ్డ అనిత‌
  • ఇంటికొచ్చి తాట తీస్తాన‌ని హెచ్చ‌రిక‌
  • హైద‌రాబాద్‌లోని ఇంటిని ఎవ‌రికి రాసిచ్చావ‌ని ప్ర‌శ్న‌
ఏపీలో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. రాజ‌కీయ విమ‌ర్శ‌లు దాటేసి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకుంటున్న వైనం చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా బుధ‌వారం టీడీపీ మ‌హిళా విభాగం తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత... వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం ఆప‌క‌పోతే.. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న తాట తీస్తాన‌ని ఆమె ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

త‌న కేరెక్ట‌ర్ గురించి మ‌రోమారు మాట్లాడితే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చరిత్ర మొత్తం మీడియా ముందు పెడ‌తానంటూ అనిత హెచ్చ‌రించారు. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి మాట‌ల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదని ఆమె తేల్చి చెప్పారు. చంద్ర‌బాబు సీఎం కాగానే.. వైసీపీ నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి వారికి బ‌డిత పూజ చేస్తామ‌ని అనిత మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిని ఎవ‌రికి రాసిచ్చారో ద‌మ్ముంటే చెప్పాల‌ని ఆమె స‌వాల్ విసిరారు.
vangalapudi anitha
Anitha
prasanna kumar reddy
YSRCP
TDP

More Telugu News